అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు అందరూ వారి వసతి గృహాల్లో ఉన్నారు: షాక్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వ న్యాయవాది

09-02-2017 Thu 16:13 | National
అన్నాడీఎంకేకు చెందిన 130 మంది ఎమ్మెల్యేలంతా ఎక్కడ ఉన్నారంటూ తమిళనాడుకు చెందిన  ప్రముఖ న్యాయవాది బాలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై హెబియస్ కార్పస్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ న్యాయవాది వీఎం రాజేంద్రన్ స్పందిస్తూ, అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు అందరూ వారి వసతి గృహాల్లో క్షేమంగా ఉన్నారని హైకోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను అత్యవసర కేసుగా పరిగణించాలన్న పిటిషన్ దారు అభ్యర్థనను కోర్టు అంగీకరించలేదు.

కాగా, శశికళ శిబిరంలో అజ్ఞాతంలో వున్న అన్నా డీఏంకే ఎమ్మెల్యేలను విడిపించాలంటూ ఓపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డీజీపీని ఆదేశిస్తే, మరోపక్క ప్రభుత్వ లాయర్ హైకోర్టుకు వారంతా స్వేచ్చగా, క్షేమంగా ఉన్నారంటూ తెలపడం గమనించదగ్గ విషయం. మరోపక్క అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలను రహస్య ప్రాంతానికి శశికళ వర్గీయులు తరలించడంపై డీఎంకే నేత స్టాలిన్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యేలందరినీ స్టార్ హోటల్లో ఉంచడం ప్రజాస్వామ్యాన్ని అణచి వేసే చర్య అని, గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అన్నారు. రహస్య ప్రాంతంలో ఉన్నఅన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటి ఖుష్బూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రహస్య ప్రాంతానికి తరలివెళ్లిన ఆ ఎమ్మెల్యేలకు ఆత్మగౌరవం ఉందా? అని ఆమె ప్రశ్నించింది.

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more